తెలుగులోనే మాట్లాడండి
తెలుగులోనే అమ్మండి
ప్రపంచానికి తెలుగుని కొత్తగా పరిచయం చేయండి

అధునాతన ప్రపంచానికి అవసరం
కొత్త భాష, సరికొత్త నుడికారం


తెలుగు



భాష
భారతదేశపు ౨౨ అధికార భాషలలో తెలుగు ఒకటి. ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన తెలుగుకు ౧౦౦౦ సంవత్సరాలకు పైగా సాహిత్య చరిత్ర ఉంది. తెలంగాణలోని ౩౩ జిల్లాలు మరియు ఆంధ్రలోని ౨౬ జిల్లాలలో తెలుగు మాట్లాడతారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా దేశాల్లో కూడా ఈ భాష వాడుకలో ఉంది. తన భువనవిజయంలోని అష్టదిగ్గజాలతో తెలుగు సాహిత్యాన్ని పెంచి పోషించిన విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు తన పాలనలో మాట్లాడే అన్ని భాషలలో తెలుగు మధురమైనదని భావించి “దేశ భాషలందు తెలుగు లెస్స” అని తెలుగు భాషకున్న గొప్పతనాన్ని కీర్తించాడు.
తెలుగు వారు తెలుగులోనే చేరుకునేందుకు
గూగుల్-కెపిఎంజి ౨౦౧౭ నివేదిక ప్రకారం-౬౮% కంటే ఎక్కువ మంది ప్రజలు వారి మాతృభాషలో సమాచారం, అభ్యాసం, జ్ఞానం, వినోదానికి సంబంధించిన విషయాలు ఉండటాన్ని ఇష్టపడతున్నారు. ఇదే నివేదిక ప్రకారం ఆన్ లైన్ వాడే తెలుగు వారి సంఖ్య ౬౦% కంటే ఎక్కువగా ఉంది. మీ ఉత్పత్తులు, ఆలోచనలు, సేవలు తమ ప్రాంతంలోని మాండలికాలు మాట్లాడే ప్రతి తెలుగు వారికి చేరేలా చేయాలనుకుంటున్నారా? లేదా భారతదేశం అంతటా తెలుగు మాట్లాడే వారందరికీ మీ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని చూస్తున్నారా?
మీరు
మీ వ్యాపారాన్ని భారతదేశమంతట విస్తరించాలనుకుంటున్నారా? మీ ఉత్పత్తులు మరియు సేవలను భారతీయ భాషను మాట్లాడే ప్రతి వ్యక్తికి చేరుకోవాలనుకుంటున్నారా?


స్టాటప్?

సంస్థ?

రచయిత లేక పాఠకుల?
మేము
మేము మీ రైటింగ్-బ్రాండింగ్-కమ్యూనికేషన్ కోసం అవసరమయ్యే ఒక దుకాణంలాంటి వాళ్ళము. అలాగే తెలుగు భాషను సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపెట్టే ఒక వారధి

రచయితలు

సాంకేతిక నిపుణులు

పరిశోధకులు

భాషకున్న వినియోగదారులను ఉపయోగించుకోండి
భారతదేశపు మూల మూలను చేరుకోండి
సాంకేతికంగా వచ్చిన మార్పుల వల్ల కమ్యునికేషన్స్ తో కూడిన అనేక అవకాశాలు వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. భారతీయులందరూ ఈ నాగరిక విప్లవంలో క్రియాశీలక భాగం కావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసే అవకాశాల కోసం ఎదురు చూసే వారందరిని మా ద్వారా సులభంగా చేరుకోండి

మీది తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారమా? లేక మీరు ప్రాంతాలకు అతీతంగా తెలుగు మాట్లాడే వారందరికీ చేరువ కావాలనుకుంటే, మీరు మా కోసం వెతుకుతున్నట్లే! మా నైపుణ్యం కలిగిన రచయితలు మీ బ్రాండ్ లేదా ఉత్పత్తికి ఒక కొత్త భాషను, సరికొత్త రూపాన్ని సృష్టిస్తారు.
మాట్లాడటం అలాగే రాయడం అనేవి మానవుల భావాలను వ్యక్తీకరించడంలో రెండు ప్రధాన మార్గాలు. ప్రతి సంస్థ లేదా వ్యాపారస్తులు తన వినియోగదారులను వారి స్వంత భాషలో చేరుకోవాలని కోరుకుంటారు. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనప్పటికీ, వారి సామాజిక అవసరాలు చాలావరకు ఒకేలా ఉంటాయి. మీ ఉత్పత్తి, సేవ లేదా ఆలోచన ఏదైనా సరే, మీ వినియోగదారులను వారి మాతృభాషలో చేరుకోవడానికి మేం మీకు సహాయపడతాం.
మేము భారతదేశంలోని ౨౨ అధికార భాషలలో వివిధ రకాల భాష సేవలను అందిస్తున్నాము. మీ సంస్థ ఏదైనా భాషా సేవల కోసం చూస్తున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా ‘వర్డ్ వైజ్’ రచయితలు భారతీయ సంస్కృతి, భౌగోళిక నేపథ్యం, సమాజం గురించి లోతైన అవగాహన కలిగి ఉండి మీ ఉత్పత్తులను భారతదేశంలోని ప్రతి మూలకు చేరుకోవడంలో సహాయపడతారు. మా ద్వారా ఏ భారతీయ భాష మాట్లాడేవారినైన చేరుకోండి. వారితో కనెక్ట్ అయి మీ ఉత్పత్తులు, ఆలోచనలను విక్రయించండి.

తెలుగుతో సహా భారతదేశంలోని ౨౨భాషల్లో వ్యాసాలు రాయడం, రచనలు, పరిశోధనా పత్రాలు రాయడం.
తెలుగులోని మాండలికాలలో సహా వెబ్ సైట్లు మరియు యాప్స్ రూపొందించడానికి లాంగ్వేజ్-లోకలైజేషన్ సర్వీస్.
ప్రపంచ స్థాయి గేమింగ్ అనుభవాన్ని తెలుగు భాషలోకి తీసుకురావడం.
సినిమా, టెలివిజన్, ఓటీటీ, ఇంటర్నెట్ డాక్యుమెంటరీలకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్, సాంగ్, సోషల్ మీడియా ప్రమోషనల్ రైటింగ్.

అనువాదం అంటే ఒక పదానికి మరో భాషలో అర్థాన్ని వివరించడం మాత్రమే కాదు. ఇది ఉత్పత్తులకు విలువను జోడించి, మానవ విజ్ఞాన పరిధిని విస్తరించే చర్య. ఇది మీ పరిధిని మరింత విస్తరించుకునే మార్గం.
అనువాదం సుమారు ౬౦౦౦ సంవత్సరాల చరిత్ర కలిగిన కళ. రెండు భాషలు రాని వాడికి ఒకే భాష సరిగా రాదు అనే సామెత ఉంది! “మంచి అనువాదం అంటే దానిలో ప్రతిదీ మారినా, ఏదీ మారదు” అని గుంథర్ గ్రాస్ చెప్పారు. మీ అవసరానికి అనుగుణంగా మా అనువాదాలు మెటాఫ్రాసెస్ మరియు పారాఫ్రేసెస్ లో లభ్యమవుతాయి. మా అనువాదకులు కంప్యూటరైజ్డ్ ట్రాన్స్ లేషన్స్ అలాగే వెర్బల్ మరియు సెమాంటిక్ అనువాదం చేయడంలో నిపుణులు.
అనేక కార్పొరేట్లతో సహా ప్రభుత్వ సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు మరియు కంపెనీలు మా సేవల ద్వారా ప్రయోజనం పొందాయి. మీ సంస్థను మరో భాషలోని వ్యక్తులకు పరిచయం చేయండి. మీ బ్రాండ్ ను వారికి దగ్గర చేయండి. మా నైపుణ్యం కలిగిన అనువాదకులు మీ అనువాద అవసరాలన్నీ తీరుస్తారు. భాష ఇక ఎప్పటికి అడ్డంకి కాదు, మరో ప్రపంచంలోకి ప్రవేశించడమే!

కంప్యూటరైజ్డ్ అనువాదంతో మొదలుపెట్టి అనుభవజ్ఞులైన రచయితలు, అనువాదకుల ద్వారా అవసరాన్ని బట్టి అనువాదం చేయడం.
భౌగోళిక, సాంస్కృతిక నేపథ్యం, ప్రాంతం, పాత్రలకు తగినట్లుగా సినిమా డైలాగ్స్ అనువాదం.
తెలుగు వ్యాకరణానికి అనుగుణంగా తెలుగు భాష డేటాను మ్యాపింగ్ చేయడం అలాగే సాఫ్ట్ వేర్ సహాయంతో చేసే అనువాదాన్ని మెరుగుపరచడం.
సబ్జెక్టు నిపుణులు, శిక్షకులు, వివిధ రంగాల్లోని ప్రతిభావంతులు మమ్మల్ని సంప్రదించండి. అనేక భారతీయ భాషలలో మీ స్వరం ప్రతిధ్వనించేలా చేయండి.

భారతీయులంటేనే భిన్నత్వంలో ఏకత్వం. భారతీయులందరూ వైవిధ్యతతో కూడుకుని ఉంటారు. ప్రతి భారతీయుని అవసరాలు వేరు వేరుగా ఉంటున్నాయి. మేము మీ వ్యాపారాన్ని భాషాపరంగా అలాగే మీ ఉత్పత్తులను స్థానికీకరించడంలో, వాటిని మీ వ్యక్తిగత అభిరుచులకనుగుణంగా తీర్చిదిద్దడంలో సహాయపడతాము. మేము మీ ఉత్పత్తుల గురించి తెలుగులో రాయడం నుంచి మీ యాప్, వెబ్ సైట్లను లోకలైజ్ చేయడం వరకు అనేక రకాల సేవలను అందిస్తాము.
ఒక ప్రొడక్ట్ అందరికీ సరిపోయేలా ఉండాల్సిన అవసరం లేదు. అది కూడా భౌగోళికంగా, సామాజికంగా, భాషాపరంగా వైవిధ్యం ఉన్న భారతదేశం వంటి దేశంలో, స్థానిక ప్రజల భాష, అభిరుచులు మరియు అవసరాలకు అనుగుణంగా మీ సేవలు/ఉత్పత్తులు మారాలి. అదేవిధంగా స్థానిక భాషలో సేవలు అందుబాటులో ఉన్నప్పుడు అది పెద్ద మొత్తంలో వినియోగదారులను పెంచుకోవడంలో సహాయపడిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మీ అవసరాలకు అనుగుణంగా మీ బ్రాండ్ మరియు ఉత్పత్తులను భారతదేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడానికి మేము రచయితలను, అనువాదకులను, డిజైనర్లను, విషయ నిపుణులను మరియు స్థానికులను ఉపయోగిస్తాము. మా సేవలను సద్వినియోగం చేసుకోని మీ ఉత్పత్తుల విలువను మీ కస్టమర్ కి మరింత మెరుగ్గా అర్థమయ్యే విధంగా చెప్పండి. మరోవైపు మా వర్డ్ వైజ్ మీ ప్రాంతీయ ఉత్పత్తులను మరియు ఆలోచనలను ప్రపంచ వేదికలకు, అంతర్జాతీయ మార్కెట్స్ కు పరిచయం చేస్తుంది.

మీ యాప్లు,(Apps) వెబ్ సైట్(Web site), గేమ్ (Gaming) లను తెలుగు భాష వినియోగదారులకు చేరువ చేయండి.
ఉత్పత్తి మరియు వినియోగదారుని మధ్య భాష పరమైన సమస్యలను తొలగించండి.
గ్రామాలు, మండలాలు, జిల్లాల్లోని ప్రజలు మీ ఉత్పత్తులు, సేవల కోసం ఎదురుచూస్తుండవచ్చు.
మీలాగే ఆలోచించే వారు మరో రాష్ట్రంలో, వేరే భాషలో ఉండవచ్చు. వారితో చేరండి.

ఇది ఒక ప్రత్యేకమైన వర్డ్ వైజ్ సర్వీస్. ఇప్పటివరకు మీరు మీ ప్రత్యేకమైన ఉత్పత్తులను కేవలం తెలుగు ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశారంటే దానికి భాషా అడ్డుగోడలే కారణం కదా? కానీ, ఇప్పుడు సులభంగా ప్రతి భారతీయుడిని, అంతకు మించిన దూరాలను చేరుకోండి. మా నిపుణులైన రచయితలు, మార్కెటింగ్ మేనేజర్లు వారికున్న అద్భుతమైన రచనా నైపుణ్యం ద్వారా, భారతదేశంలోని మొత్తం ౨౨ అధికార భాషలలో మీ ఉత్పత్తులు చేరుకోవడంలో మీకు సహాయపడతారు.
భారతదేశంలో అధికార భాషలుగా ౨౨ భాషలు గుర్తించబడగా, మొత్తం ౧౨౨ ప్రధాన భాషలు మరియు ౧౫౦౦కి పైగా ఇతర భాషలు ఉన్నాయి. ఇప్పుడు డిజిటలైజేషన్ సహాయంతో, భారతదేశంలో ఒక భాష మాట్లాడే వ్యక్తి లేదా స్థానిక సంస్థలు ఇతర రాష్ట్రాలు మరియు భాష సరిహద్దులను దాటి వారి బిజినెస్ ను సులభంగా విస్తరించుకోవచ్చు. చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులు కూడా భాష సహాయంతో తమ మార్కెట్ ను విస్తరించుకోవచ్చు.
భారతదేశంలో ౨౨ శాతానికి పైగా ప్రజలు రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. వర్డ్ వైజ్ ఒక ప్రత్యేకత ఏంటంటే, మేము సుమారు ౪౬౨ భాషా కలయికల్లో అనువాదాలు చేస్తాము. వర్డ్ వైజ్ ఈ పనుల కోసం నైపుణ్యం కలిగిన అనువాదకులు, బహుభాషా రచయితలు మరియు మార్కెటింగ్ నిపుణులను మీతో జతచేస్తుంది. ఈ అంతర్భాష అనువాదాలు చేయడం ద్వారా భారతదేశంలోని విభిన్న సంస్కృతులను ఒకరికొకరు పరిచయం చేసి ప్రాంతీయ మార్కెట్లను విస్తరించడమే మా లక్ష్యం.

వర్డ్ వైజ్ లో ౪౬౪ భాషా కలయికలల్లో అనువాదం చేయగల ద్విభాషా మరియు బహుభాషా అనువాదకులు ఉన్నారు.
రాష్ట్ర సరిహద్దులు దాటి, మీ ఆలోచనలను, ఉత్పత్తులను, సేవలను డెలివరీ చేయండి మరియ అమ్మండి.
భారతదేశంలోని వివిధ భాషల్లో ఉండే నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని పంచుకుని ఎదగండి.
భాష ఒక విలువ. ఆ విలువను మీ ఉత్పత్తులకు జోడించుకోండి.

మాది ఒక కొత్త తరం కంపెనీ. మా లక్ష్యం భారతీయ భాషలు మాట్లాడేవారికి వారి స్వంత భాషలో శాస్త్రీయ, సాంకేతికతను అందించడం. వారికి తగిన యాప్స్ ని పొందేందుకు కావాల్సిన ఆవకాశాలు కల్పించి సహాయం చేయడం. మేము మీ స్వంత భాషలో యాప్లు, వెబ్సైట్లను రూపొందించడం ద్వారా తెలుగు సాంకేతిక అభివృద్ధికి తోడ్పడతాం.
వాస్తవానికి ఐరోపాలోని భాషలు సాంకేతిక పరిజ్ఞానం అన్వేషణలో ప్రపంచంలోని మిగిలిన భాషల కంటే వేగంగా అభివృద్ధి చెంది, దానివల్ల వచ్చిన అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికే స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ‘సహజ భాషా విశ్లేషణ’(NLP)పై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు భారతీయ భాషలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
వర్డ్ వైజ్ చేసే అధ్యయనాలు, నివేదికలు, సర్వేలు మరియు విశ్లేషణలు మీ సంస్థకు తెలుగు ప్రాంతంలోని వివిధ రకాల అభిరుచులు, ఆసక్తులకు చెందిన వ్యక్తులను చేరుకోవడంలో సహాయపడతాయి. మీ ఉత్పత్తులను సరైన వినియోగదారులకు చేరేలా చేయడానికి మా భాష, రచనా, అనువాదం మరియు ఇతర సేవలను ఉపయోగించండి. మా వర్డ్ వైజ్ మార్కెట్ రిపోర్టులు చిన్న నుండి మధ్య తరహా వ్యాపారాలు దేశవ్యాప్తంగా విస్తరించడానికి మరియు మార్కెట్ విస్తరణకు దిశానిర్దేశం చేయగలవు.

ప్రాంతీయ మార్కెట్లను బాగా అర్థం చేసుకోవడానికి వర్డ్ వైజ్ అందించే సర్వేలు, విశ్లేషణలు, వ్యాసాలను ఉపయోగించండి.
మా మార్కెట్ పరిశోధన మరియు వ్యక్తిగతమైన మార్కెటింగ్ కంటెంట్ సహాయంతో పూర్తిగా స్థానిక ప్రదేశాలను (Hyper-local) చేరుకోండి.
మా క్లౌడ్ ఆధారిత డ్యాష్ బోర్డులో మీ డేటా మరియు కంటెంట్ సురక్షితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా, ఎక్కడినుండైనా యాక్సెస్ చేసుకోవచ్చు.
లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మరియు ఇతర డ్యాష్ బోర్డులకు కావాల్సిన భాష మరియు API మద్దతునివ్వడం.
మా మరిన్ని విస్తరించిన సేవల గురించి తెలుసుకోవడానికి

సంఖ్యలు
సంఖ్యల రూపంలో కొన్ని అక్షరాలు.
మా కస్టమర్స్ & భాగస్వాములు












ప్రసంశ
మా కృషిని అభినందించినవారు.







మా వర్డ్ వైజ్ గ్యాలరీని సందర్శించండి
భారతీయ భాషలు, భాషశాస్త్రం, భాష సాంకేతికత గురించి మరింత తెలుసుకోవడానికి సందర్శించండి మా “వైస్ వర్డ్స్”

జ్ఞానం కల్పన బుద్ధి
అద్భుతమైన పఠన ప్రపంచానికి స్వాగతం
భారతీయ భాషలు, భాషశాస్త్రం, భాష సాంకేతికత గురించి మరింత తెలుసుకోవడానికి సందర్శించండి మా “వైస్ వర్డ్స్”

Language before the Evolution the Language
In a study published in Science Advances, Stuart K. Watson and colleagues investigate the ability of monkeys, apes, and humans to process nonadjacent dependencies in

Addressing the Needs of Multilingual Learners
With globalization, there has been an increasing demand for education systems to accommodate the needs of multilingual learners.

Importance of Preserving India’s Endangered Languages
India is home to a diverse range of languages. The other spectrum of this reality is many of these languages are endangered and at risk

మీరు నిర్దిష్టమైన వాటి కోసం చూస్తున్నారా?

మాతో టచ్ లో ఉండండి
