తెలుగులోనే మాట్లాడండి

తెలుగులోనే అమ్మండి

ప్రపంచానికి తెలుగుని కొత్తగా పరిచయం చేయండి

అధునాతన ప్రపంచానికి అవసరం

కొత్త భాష, సరికొత్త నుడికారం

kannada-main-image
city-vibe-road

తెలుగు

ashoka-chakra-image

భాష

భారతదేశపు ౨౨ అధికార భాషలలో తెలుగు ఒకటి. ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన తెలుగుకు ౧౦౦౦ సంవత్సరాలకు పైగా సాహిత్య చరిత్ర ఉంది. తెలంగాణలోని ౩౩ జిల్లాలు మరియు ఆంధ్రలోని ౨౬ జిల్లాలలో తెలుగు మాట్లాడతారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా దేశాల్లో కూడా ఈ భాష వాడుకలో ఉంది. తన భువనవిజయంలోని అష్టదిగ్గజాలతో తెలుగు సాహిత్యాన్ని పెంచి పోషించిన విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు తన పాలనలో మాట్లాడే అన్ని భాషలలో తెలుగు మధురమైనదని భావించి “దేశ భాషలందు తెలుగు లెస్స” అని తెలుగు భాషకున్న గొప్పతనాన్ని కీర్తించాడు.

తెలుగు వారు తెలుగులోనే చేరుకునేందుకు

గూగుల్-కెపిఎంజి ౨౦౧౭ నివేదిక ప్రకారం-౬౮% కంటే ఎక్కువ మంది ప్రజలు వారి మాతృభాషలో సమాచారం, అభ్యాసం, జ్ఞానం, వినోదానికి సంబంధించిన విషయాలు ఉండటాన్ని ఇష్టపడతున్నారు. ఇదే నివేదిక ప్రకారం ఆన్ లైన్ వాడే తెలుగు వారి సంఖ్య ౬౦% కంటే ఎక్కువగా ఉంది. మీ ఉత్పత్తులు, ఆలోచనలు, సేవలు తమ ప్రాంతంలోని మాండలికాలు మాట్లాడే ప్రతి తెలుగు వారికి చేరేలా చేయాలనుకుంటున్నారా? లేదా భారతదేశం అంతటా తెలుగు మాట్లాడే వారందరికీ మీ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని చూస్తున్నారా?

మీరు

మీ వ్యాపారాన్ని భారతదేశమంతట విస్తరించాలనుకుంటున్నారా? మీ ఉత్పత్తులు మరియు సేవలను భారతీయ భాషను మాట్లాడే ప్రతి వ్యక్తికి చేరుకోవాలనుకుంటున్నారా?

స్టాటప్?

మీరు మీ ఉత్పత్తులను ప్రతి జిల్లా, మండలం మరియు గ్రామాలకు చేరుకోవాలనుకుంటున్నారా?

సంస్థ?

మీ ప్రకటనలకు ఆదరణ లేదా? భాషపై ఏ మాత్రం పట్టులేని సంస్థలను పక్కన పెట్టి మమ్మల్ని కలవండి.

రచయిత లేక పాఠకుల?

మీరు పాఠకులైతే వైజ్ వర్డ్స్ ను సందర్శించండి. మీరు రచయిత అయితే, ఇక్కడ క్లిక్ చేయండి.

మేము

మేము మీ రైటింగ్-బ్రాండింగ్-కమ్యూనికేషన్ కోసం అవసరమయ్యే ఒక దుకాణంలాంటి వాళ్ళము. అలాగే తెలుగు భాషను సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపెట్టే ఒక వారధి

రచయితలు

ప్రజలు, ప్రపంచం గురించి తెలిసి, వివిధ రకాల అభిరుచులతో కూడి అంకితభావమే తమ పెట్టుబడిగా గల వ్యక్తులు
regional-experts-icon

సాంకేతిక నిపుణులు

డేటా అనాలిసిస్, మార్కెట్ అధ్యయనంలో ఆసక్తి ఉండి, నైపుణ్యం కలిగిన వ్యక్తులు
writers-icon

పరిశోధకులు

వివిధ మానవీయ, వైజ్ఞానిక విభాగాల్లో స్నాతకోత్తర, డాక్టరేట్ డిగ్రీలు కలిగి, అనేక రంగాల్లో ప్రావీణ్యం ఉన్న విషయ నిపుణులు
happy-face-images

భాషకున్న వినియోగదారులను ఉపయోగించుకోండి

భారతదేశపు మూల మూలను చేరుకోండి

సాంకేతికంగా వచ్చిన మార్పుల వల్ల కమ్యునికేషన్స్ తో కూడిన అనేక అవకాశాలు వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. భారతీయులందరూ ఈ నాగరిక విప్లవంలో క్రియాశీలక భాగం కావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసే అవకాశాల కోసం ఎదురు చూసే వారందరిని మా ద్వారా సులభంగా చేరుకోండి

original-wriitng-service-icon

మీది తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారమా? లేక మీరు ప్రాంతాలకు అతీతంగా తెలుగు మాట్లాడే వారందరికీ చేరువ కావాలనుకుంటే, మీరు మా కోసం వెతుకుతున్నట్లే! మా నైపుణ్యం కలిగిన రచయితలు మీ బ్రాండ్ లేదా ఉత్పత్తికి ఒక కొత్త భాషను, సరికొత్త రూపాన్ని సృష్టిస్తారు.

మాట్లాడటం అలాగే రాయడం అనేవి మానవుల భావాలను వ్యక్తీకరించడంలో రెండు ప్రధాన మార్గాలు. ప్రతి సంస్థ లేదా వ్యాపారస్తులు తన వినియోగదారులను వారి స్వంత భాషలో చేరుకోవాలని కోరుకుంటారు. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనప్పటికీ, వారి సామాజిక అవసరాలు చాలావరకు ఒకేలా ఉంటాయి. మీ ఉత్పత్తి, సేవ లేదా ఆలోచన ఏదైనా సరే, మీ వినియోగదారులను వారి మాతృభాషలో చేరుకోవడానికి మేం మీకు సహాయపడతాం. 

మేము భారతదేశంలోని ౨౨ అధికార భాషలలో వివిధ రకాల భాష సేవలను అందిస్తున్నాము. మీ సంస్థ ఏదైనా భాషా సేవల కోసం చూస్తున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా ‘వర్డ్ వైజ్’ రచయితలు భారతీయ సంస్కృతి, భౌగోళిక నేపథ్యం, సమాజం గురించి లోతైన అవగాహన కలిగి ఉండి మీ ఉత్పత్తులను భారతదేశంలోని ప్రతి మూలకు చేరుకోవడంలో సహాయపడతారు. మా ద్వారా ఏ భారతీయ భాష మాట్లాడేవారినైన చేరుకోండి. వారితో కనెక్ట్ అయి మీ ఉత్పత్తులు, ఆలోచనలను విక్రయించండి.

user-research-graph-image

తెలుగుతో సహా భారతదేశంలోని ౨౨భాషల్లో వ్యాసాలు రాయడం, రచనలు, పరిశోధనా పత్రాలు రాయడం.

తెలుగులోని మాండలికాలలో సహా వెబ్ సైట్లు మరియు యాప్స్ రూపొందించడానికి లాంగ్వేజ్-లోకలైజేషన్ సర్వీస్.

ప్రపంచ స్థాయి గేమింగ్ అనుభవాన్ని తెలుగు భాషలోకి తీసుకురావడం.

సినిమా, టెలివిజన్, ఓటీటీ, ఇంటర్నెట్ డాక్యుమెంటరీలకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్, సాంగ్, సోషల్ మీడియా ప్రమోషనల్ రైటింగ్.

app-hyper-localization-service-icon

అనువాదం అంటే ఒక పదానికి మరో భాషలో అర్థాన్ని వివరించడం మాత్రమే కాదు. ఇది ఉత్పత్తులకు విలువను జోడించి, మానవ విజ్ఞాన పరిధిని విస్తరించే చర్య. ఇది మీ పరిధిని మరింత విస్తరించుకునే మార్గం.

అనువాదం సుమారు ౬౦౦౦ సంవత్సరాల చరిత్ర కలిగిన కళ. రెండు భాషలు రాని వాడికి ఒకే భాష సరిగా రాదు అనే సామెత ఉంది! “మంచి అనువాదం అంటే దానిలో ప్రతిదీ మారినా, ఏదీ మారదు” అని గుంథర్ గ్రాస్ చెప్పారు. మీ అవసరానికి అనుగుణంగా మా అనువాదాలు మెటాఫ్రాసెస్ మరియు పారాఫ్రేసెస్ లో లభ్యమవుతాయి. మా అనువాదకులు కంప్యూటరైజ్డ్ ట్రాన్స్ లేషన్స్ అలాగే వెర్బల్ మరియు సెమాంటిక్ అనువాదం చేయడంలో నిపుణులు. 

అనేక కార్పొరేట్లతో సహా ప్రభుత్వ సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు మరియు కంపెనీలు మా సేవల ద్వారా ప్రయోజనం పొందాయి. మీ సంస్థను మరో భాషలోని వ్యక్తులకు పరిచయం చేయండి. మీ బ్రాండ్ ను వారికి దగ్గర చేయండి. మా నైపుణ్యం కలిగిన అనువాదకులు మీ అనువాద అవసరాలన్నీ తీరుస్తారు. భాష ఇక ఎప్పటికి అడ్డంకి కాదు, మరో ప్రపంచంలోకి ప్రవేశించడమే!

user-research-graph-image2

కంప్యూటరైజ్డ్ అనువాదంతో మొదలుపెట్టి అనుభవజ్ఞులైన రచయితలు, అనువాదకుల ద్వారా అవసరాన్ని బట్టి అనువాదం చేయడం.

భౌగోళిక, సాంస్కృతిక నేపథ్యం, ప్రాంతం, పాత్రలకు తగినట్లుగా సినిమా డైలాగ్స్ అనువాదం.

తెలుగు వ్యాకరణానికి అనుగుణంగా తెలుగు భాష డేటాను మ్యాపింగ్ చేయడం అలాగే సాఫ్ట్ వేర్ సహాయంతో చేసే అనువాదాన్ని మెరుగుపరచడం.

సబ్జెక్టు నిపుణులు, శిక్షకులు, వివిధ రంగాల్లోని ప్రతిభావంతులు మమ్మల్ని సంప్రదించండి. అనేక భారతీయ భాషలలో మీ స్వరం ప్రతిధ్వనించేలా చేయండి.

translation-service-icon

భారతీయులంటేనే భిన్నత్వంలో ఏకత్వం. భారతీయులందరూ వైవిధ్యతతో కూడుకుని ఉంటారు. ప్రతి భారతీయుని అవసరాలు వేరు వేరుగా ఉంటున్నాయి. మేము మీ వ్యాపారాన్ని భాషాపరంగా అలాగే మీ ఉత్పత్తులను స్థానికీకరించడంలో, వాటిని మీ వ్యక్తిగత అభిరుచులకనుగుణంగా తీర్చిదిద్దడంలో సహాయపడతాము. మేము మీ ఉత్పత్తుల గురించి తెలుగులో రాయడం నుంచి మీ యాప్, వెబ్ సైట్లను లోకలైజ్ చేయడం వరకు అనేక రకాల సేవలను అందిస్తాము.

ఒక ప్రొడక్ట్ అందరికీ సరిపోయేలా ఉండాల్సిన అవసరం లేదు. అది కూడా భౌగోళికంగా, సామాజికంగా, భాషాపరంగా వైవిధ్యం ఉన్న భారతదేశం వంటి దేశంలో, స్థానిక ప్రజల భాష, అభిరుచులు మరియు అవసరాలకు అనుగుణంగా మీ సేవలు/ఉత్పత్తులు మారాలి. అదేవిధంగా స్థానిక భాషలో సేవలు అందుబాటులో ఉన్నప్పుడు అది పెద్ద మొత్తంలో వినియోగదారులను పెంచుకోవడంలో సహాయపడిందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

మీ అవసరాలకు అనుగుణంగా మీ బ్రాండ్ మరియు ఉత్పత్తులను భారతదేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడానికి మేము రచయితలను, అనువాదకులను, డిజైనర్లను, విషయ నిపుణులను మరియు స్థానికులను ఉపయోగిస్తాము. మా సేవలను సద్వినియోగం చేసుకోని మీ ఉత్పత్తుల విలువను మీ కస్టమర్ కి మరింత మెరుగ్గా అర్థమయ్యే విధంగా చెప్పండి. మరోవైపు మా వర్డ్ వైజ్ మీ ప్రాంతీయ ఉత్పత్తులను మరియు ఆలోచనలను ప్రపంచ వేదికలకు, అంతర్జాతీయ మార్కెట్స్ కు పరిచయం చేస్తుంది.

user-research-graph-image3

మీ యాప్‌లు,(Apps) వెబ్ సైట్(Web site), గేమ్ (Gaming) లను తెలుగు భాష వినియోగదారులకు చేరువ చేయండి.

ఉత్పత్తి మరియు వినియోగదారుని మధ్య భాష పరమైన సమస్యలను తొలగించండి.

గ్రామాలు, మండలాలు, జిల్లాల్లోని ప్రజలు మీ ఉత్పత్తులు, సేవల కోసం ఎదురుచూస్తుండవచ్చు.

మీలాగే ఆలోచించే వారు మరో రాష్ట్రంలో, వేరే భాషలో ఉండవచ్చు. వారితో చేరండి.

consumer-behaviour-service-icon

ఇది ఒక ప్రత్యేకమైన వర్డ్ వైజ్ సర్వీస్. ఇప్పటివరకు మీరు మీ ప్రత్యేకమైన ఉత్పత్తులను కేవలం తెలుగు ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశారంటే దానికి భాషా అడ్డుగోడలే కారణం కదా? కానీ, ఇప్పుడు సులభంగా ప్రతి భారతీయుడిని, అంతకు మించిన దూరాలను చేరుకోండి. మా నిపుణులైన రచయితలు, మార్కెటింగ్ మేనేజర్లు వారికున్న అద్భుతమైన రచనా నైపుణ్యం ద్వారా, భారతదేశంలోని మొత్తం ౨౨ అధికార భాషలలో మీ ఉత్పత్తులు చేరుకోవడంలో మీకు సహాయపడతారు.

భారతదేశంలో అధికార భాషలుగా ౨౨ భాషలు గుర్తించబడగా, మొత్తం ౧౨౨ ప్రధాన భాషలు మరియు ౧౫౦౦కి పైగా ఇతర భాషలు ఉన్నాయి. ఇప్పుడు డిజిటలైజేషన్ సహాయంతో, భారతదేశంలో ఒక భాష మాట్లాడే వ్యక్తి లేదా స్థానిక సంస్థలు ఇతర రాష్ట్రాలు మరియు భాష సరిహద్దులను దాటి వారి బిజినెస్ ను సులభంగా విస్తరించుకోవచ్చు. చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులు కూడా భాష సహాయంతో తమ మార్కెట్ ను విస్తరించుకోవచ్చు.

భారతదేశంలో ౨౨ శాతానికి పైగా ప్రజలు రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. వర్డ్ వైజ్ ఒక ప్రత్యేకత ఏంటంటే, మేము సుమారు ౪౬౨ భాషా కలయికల్లో అనువాదాలు చేస్తాము. వర్డ్ వైజ్ ఈ పనుల కోసం నైపుణ్యం కలిగిన అనువాదకులు, బహుభాషా రచయితలు మరియు మార్కెటింగ్ నిపుణులను మీతో జతచేస్తుంది. ఈ అంతర్భాష అనువాదాలు చేయడం ద్వారా భారతదేశంలోని విభిన్న సంస్కృతులను ఒకరికొకరు పరిచయం చేసి ప్రాంతీయ మార్కెట్లను విస్తరించడమే మా లక్ష్యం.

user-research-graph-image4

వర్డ్ వైజ్ లో ౪౬౪ భాషా కలయికలల్లో అనువాదం చేయగల ద్విభాషా మరియు బహుభాషా అనువాదకులు ఉన్నారు.

రాష్ట్ర సరిహద్దులు దాటి, మీ ఆలోచనలను, ఉత్పత్తులను, సేవలను డెలివరీ చేయండి మరియ అమ్మండి.

భారతదేశంలోని వివిధ భాషల్లో ఉండే నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని పంచుకుని ఎదగండి.

భాష ఒక విలువ. ఆ విలువను మీ ఉత్పత్తులకు జోడించుకోండి.

holy-triple-service-icon

మాది ఒక కొత్త తరం కంపెనీ. మా లక్ష్యం భారతీయ భాషలు మాట్లాడేవారికి వారి స్వంత భాషలో శాస్త్రీయ, సాంకేతికతను అందించడం. వారికి తగిన యాప్స్ ని పొందేందుకు కావాల్సిన ఆవకాశాలు కల్పించి సహాయం చేయడం. మేము మీ స్వంత భాషలో యాప్‌లు, వెబ్‌సైట్‌లను రూపొందించడం ద్వారా తెలుగు సాంకేతిక అభివృద్ధికి తోడ్పడతాం.

వాస్తవానికి ఐరోపాలోని భాషలు సాంకేతిక పరిజ్ఞానం అన్వేషణలో ప్రపంచంలోని మిగిలిన భాషల కంటే వేగంగా అభివృద్ధి చెంది, దానివల్ల వచ్చిన అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికే స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ‘సహజ భాషా విశ్లేషణ’(NLP)పై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు భారతీయ భాషలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 

వర్డ్ వైజ్ చేసే అధ్యయనాలు, నివేదికలు, సర్వేలు మరియు విశ్లేషణలు మీ సంస్థకు తెలుగు ప్రాంతంలోని వివిధ రకాల అభిరుచులు, ఆసక్తులకు చెందిన వ్యక్తులను చేరుకోవడంలో సహాయపడతాయి. మీ ఉత్పత్తులను సరైన వినియోగదారులకు చేరేలా చేయడానికి మా భాష, రచనా, అనువాదం మరియు ఇతర సేవలను ఉపయోగించండి. మా వర్డ్ వైజ్ మార్కెట్ రిపోర్టులు చిన్న నుండి మధ్య తరహా వ్యాపారాలు దేశవ్యాప్తంగా విస్తరించడానికి మరియు మార్కెట్ విస్తరణకు దిశానిర్దేశం చేయగలవు.

user-research-graph-image5

ప్రాంతీయ మార్కెట్లను బాగా అర్థం చేసుకోవడానికి వర్డ్ వైజ్ అందించే సర్వేలు, విశ్లేషణలు, వ్యాసాలను ఉపయోగించండి.

మా మార్కెట్ పరిశోధన మరియు వ్యక్తిగతమైన మార్కెటింగ్ కంటెంట్ సహాయంతో పూర్తిగా స్థానిక ప్రదేశాలను (Hyper-local) చేరుకోండి.

మా క్లౌడ్ ఆధారిత డ్యాష్ బోర్డులో మీ డేటా మరియు కంటెంట్ సురక్షితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా, ఎక్కడినుండైనా యాక్సెస్ చేసుకోవచ్చు.

లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మరియు ఇతర డ్యాష్ బోర్డులకు కావాల్సిన భాష మరియు API మద్దతునివ్వడం.

మా మరిన్ని విస్తరించిన సేవల గురించి తెలుసుకోవడానికి

సంఖ్యలు

సంఖ్యల రూపంలో కొన్ని అక్షరాలు.

0 Cr
౧౦ కోట్ల పదాలను ౧౦ భాషల్లో అనువదించడం.
0 k+
౧౦వేల గంటలకు పైగా బహుభాషా లిప్యంతరీకరణ అనుభవం.
0 +
౬ భాషల్లో ౫ వేలకు పైగా వ్యాసాలు రాయడం.
0 k+
౧౦౦౦ గంటలకు పైగా టెలివిజన్ సీరియల్స్ రచన.
0 +
౧౦ భాషల్లో ౧౦౦కి పైగా సినిమాలకు డైలాగ్స్ అనువాదం.
0 +
౧౫౦౦౦౦ మాండలిక పదాల కార్పోరాను అన్వయించడం & విశ్లేషించడం.

మా కస్టమర్స్ & భాగస్వాములు

cloth-knitting-image

ప్రసంశ

మా కృషిని అభినందించినవారు.

మా వర్డ్ వైజ్ గ్యాలరీని సందర్శించండి

భారతీయ భాషలు, భాషశాస్త్రం, భాష సాంకేతికత గురించి మరింత తెలుసుకోవడానికి సందర్శించండి మా “వైస్ వర్డ్స్”

జ్ఞానం కల్పన బుద్ధి

అద్భుతమైన పఠన ప్రపంచానికి స్వాగతం

భారతీయ భాషలు, భాషశాస్త్రం, భాష సాంకేతికత గురించి మరింత తెలుసుకోవడానికి సందర్శించండి మా “వైస్ వర్డ్స్”

మీరు నిర్దిష్టమైన వాటి కోసం చూస్తున్నారా?

మాతో టచ్ లో ఉండండి

ghost-writer-image

మా చిరునామా

#౭౭, హెగ్గోడు,
సాగర (మ), శివమొగ్గ (జి)
కర్ణాటక, భారతదేశం
౫౭౭౪౧౭

బెంగళూరు చిరునామా

C౪, మెజెస్టీ బ్లాక్,
సంతారా మగన్ ప్లేస్-౨,
హులిమావు, బెంగళూరు.
౫౬౦౦౭౬.

Ⓒ 2023, WordWise Language Labs LLP., ఈ వెబ్‌సైట్‌లోని అన్ని డిజిటల్ ఆస్తులు కాపీరైట్ చేయబడ్డాయి

ಕನ್ನಡ
Kannada
தமிழ்
Tamil
తెలుగు
Telugu
മലയാളം
Malayalam
मराठी
Marathi
हिंदी
Hindi
বাংলা
Bengali
ગુજરાતી
Gujarati
ਪੰਜਾਬੀ
Punjabi
ଓଡିଆ
Odia
অসমীয়া
Assamese
Manipuri
Manipuri

Words’WorthTm Platform

In tune with the Indian tone.

Harness India’s First Hyper-Local Content Marketing Platform to Penetrate into the Non-English Speaking Markets of India.

Solutions

Original Writing  

Got a universal product or solution and want to scale beyond English and urban centers? We can help in 22 Indian official languages.

Localization  

Reach the very last mile of the linguistic supply chain and and ideas with our meticulous localization experts.

Translation  

Ranging from single-page, over-the-counter translation to OCR, ML and MTPE – based Translation is done in 22 languages of India.

Multi Lingual User Research

Use our Reports and alalytics based on purely statistical and scientific models for regional & hyper-regional marketing.

Library

Rich resources on language diversity, translation tech, and culture, aiding India’s linguistic connectivity.

Academia

Exploring language-tech dynamics, bridging academia and practical solutions for India’s linguistic mosaic.

Case Studies

Real successes using our solutions to break language barriers, fostering business growth and engagement.

Long Read

In-depth insights on digital Indian languages, culture, and preservation in a changing landscape.

Reportage

Statistical analysis, interviews, and surveys showcasing Indian language-tech intersection and its significance.

WordWise Labs

Statistical analysis, interviews, and surveys showcasing Indian language-tech intersection and its significance.

Magazine

This website uses cookies to ensure you get the best experience on our website